నేతన్న చౌరస్తా, జూన్ 29: జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా మసీదుల్లో మతపెద్దలు ప్రత్యేక సందేశం ఇచ్చారు. త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ ముస్లిం సమాజంలో సాటివాళ్లపై ప్రేమాభిమానాలు పంచేందుకు ప్రేరణ ఇవ్వాలని సూచించారు. ముస్లింలు పాల్గొన్నారు.
గంభీరావుపేట, జూన్ 28: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఎల్లారెడ్డిపేట, జూన్ 29: త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. గురువారం బక్రీద్ వేడుకల్లో ఆయన పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇల్లంతకుంట, 29 : మండలంలో ముస్లింలు బక్రీద్ వేడుకలు బక్రీద్‌ను పురస్కరించుకుని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు నిరుపేదలకు దాన ధర్మాలు చేశారు.
వీర్నపల్లి, జూన్ 29: మండలంలోని ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. జడ్పీటీసీ గుగులోత్ కళావతి, ఎంపీపీ మాలోత్ భూల, సెస్ డైరెక్టర్ మాడ్గుల మల్లేశం, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు ఎడ్ల సాగర్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
వేములవాడ టౌన్, జూన్ 29 : త్యాగనిరతికి, నిస్వార్థ సేవాగుణానికి సంకేతం బక్రీద్ అని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. పట్టణంలోని ముస్లింలు కొత్త బట్టలు ధరించి మసీదులవైపు సాగారు. ఇమాం నాజిమ్ రజా బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. హిందూ ముస్లింలు ఒకిరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రం, కో ఆప్షన్ సభ్యుడు షేక్ బాబూన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్, మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఇమాం, అబ్దుల్ రజాక్, బషీర్, సర్వర్‌పాషా, అజ్మత్ అలీ, నాయకులు అంజద్‌పాషా, తాహెర్పాషా, లాయక్‌పాషా, మన్నాన్, అహ్మద్‌పాషా, రసూల్, పీర్ మహ్మద్, అమానుల్లాఖాన్, షేక్ రియాజ్, అక్రమ్, రఫీక్, షేక్ఇమామ్, బుర్హాన్, కలీంపాషా, షేక్‌షరీఫ్, సయ్యద్ అతీక్, షకీల్, నవాబ్ఖాన్, రసూల్‌ఖాన్, సత్తార్ పాల్గొన్నారు. బక్రీద్ ఏర్పాట్లకు సహకరించిన శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ అన్వేష్, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్, సెస్, పురపాలక సిబ్బందికి ముస్లిం కమిటీ పట్టణాధ్యక్షుడు అక్రమ్‌పాషా కృతజ్ఞతలు తెలిపారు.
కోనరావుపేట, జూన్ 29: మండల వ్యాప్తంగా బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే నూతన వస్ర్తాలు ధరించి మసీదులకు వెళ్లి నమోజు చేశారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
చందుర్తి(రుద్రంగి), జూన్ 29: చందుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ వేడుకలు వేడుకలు జరుపుకొన్నారు. ఇక్కడ ఎండీ బాబు, ఎండీ సలీం, మహమ్మద్ హైమద్, కరీమ్, ఎండీ అజీమ్, రాజ్ మహమ్మద్, మహమ్మద్ రజాక్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 29: సిరిసిల్ల మున్సిపల్ పరిదిలోని పెద్దూరు,రగుడు,చంద్రంపేట,రాజీవ్‌నగర్,చిన్నబోనాల,సర్దాపూర్ తదితర గ్రామాల్లో బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పెద్దూరులోని తుర్కకాశీపల్లెలో మసీదులో ముస్లీంలకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు నేతలు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. షేక్ అలీ, యాకుబ్తోపాటు ముస్లీం నేతలు ఉన్నారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంతోపాటు తాడూరు, బద్దెనపల్లి,జిల్లెల్ల, రాళ్లపేట,అంకుసాపూర్,రాంచంద్రపూర్, సారంపల్లితోపాటు పలు గ్రామాల్లో ముస్లీం సోదరులు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మసీదు కమీటి అధ్యక్షుడు ఎండీ హమీద్, ఎండీ హైమద్, మౌలాన అక్రం రజా, హైదర్, బాబా సలీం, జానీ ఇమాం,అజిం, ఖలీల్, గౌసోద్దిన్తోపాటు మైనార్టీ నేతలు ఉన్నారు.
ముస్తాబాద్, జూన్ 29: మండలంలో తొలి ఏకాదశి వేడుకలతోపాటు బక్రీద్‌ను ఘనంగా నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.