Awareness of CPR | వీణవంక, అక్టోబర్ 17: వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గుండెపోటు వచ్చినపుడు చేయాల్సిన సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వరుణ మాట్లాడుతూ గుండెపోటు వచ్చినపుడు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడటానికి 108 వాహనానికి ఫోన్ చేసి వ్యక్తిని పిలిచినప్పుడు స్పందన లేకున్నా.. వ్యక్తి శ్యాసను పరిశీలించి వెంటనే సీపీఆర్ చేయాలని సూచించారు.
ఇందుకోసం సీపీఆర్ మ్యాన్ కిన్ బొమ్మ ద్వారా విద్యార్థుల ఎదుట సీపీఆర్ చేసి చూపించారు. సీపీఆర్ విధానం ద్వారా చావుబతుకులో ఉన్న వ్యక్తిని బతికించవచ్చలుని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, డాక్టర్లు రజినీకాంత్, తేజశ్విని, లైబ్రేరియన్ రామ్మోహన్రావు, అధ్యాపకులు రవీందర్, భాస్కర్, కత్తెరశాల, శోభన్‌బాబు, జయపాల్ రెడ్డి, కరుణ, కల్పన, శైలజ, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.