Sulthanabad | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 29 : 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగు సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం, లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు పోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముకునేందుకు బహిరంగ వేలంపాట నిర్వహించినట్లు ఈవో శంకరయ్య తెలిపారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో సోమవారం తలనీలాలు పోగు చేసుకునేందుకు రూ.82 వేలు, కొబ్బరికాయలు, బెల్లం అమ్ముకునేందుకు రూ.1 లక్ష80వేల 999, తల్లి ఆరాధన అమ్మకం హక్కు రూ.లక్ష 80 వేల 333, కొబ్బరి ముక్కలు పోగు చేసుకొనుటకు రూ.71 వేలు బహిరంగ వేలంపాటను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో శంకరయ్య మాట్లాడుతూ 2026 జనవరి 28 నుంచి 31 వరకు కాలపరిమితి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంపెల్లి సతీష్, మాజీ సర్పంచ్ కోటగిరి విజేందర్, ఉప సర్పంచ్ సతీష్, గ్రామస్తులు రమేష్, సంపత్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.