కరీంనగర్ విద్యానగర్, జూన్ 7: యూఎస్‌లోని వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంకు అధికారులతో జరిగిన సమావేశాలకు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరయ్యారు. ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ)కు అనుబంధమైన ఇంటర్నేషన్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐసీబీఏ) ప్రతినిధి బృందం యూఎస్‌లోని వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంకు అధికారులతో ఈ నెల 4 నుంచి 6 వరకు సమావేశాలు నిర్వహించింది. వీటికి ఐసీబీఏ ప్రెసిడెంట్ భీమా సుబ్రమణ్యం, ఐసీఏ ఎండీ బ్రస్సెల్స్, ఐసీబీఏ బోర్డు సభ్యులు కబీర్ అయిండే తుకూర్ తదితరులతో కలిసి కొండూరి హాజరయ్యారు. ఈవెంట్లలో ప్రపంచ బ్యాంకు పోషించే పాత్రలపై చర్చించారు. నవంబర్‌లో ఢిల్లీలో సమావేశం కావాలని అంగీకారం తెలిపారు. డేటా సేకరణపై దృష్టి, సభ్యత్వాన్ని పెంచి అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేయాలని చర్చించారు.