Konduru Ravinder Rao |రాజన్న సిరిసిల్ల, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన న్యాప్స్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మరో అరుదైన ఘనత సాధించారు. సహకార సంఘాల బలోపేతానికి, అభివృద్ధికి విశేషమైన కృషిచేసి, సహకార లెజెండ్ గా పేరు తెచ్చుకున్న కొండూరు రవీందర్ రావు బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (BIRD), లక్నో(నాబార్డ్ అనుబంధ సంస్థ)పాలక మండలి సభ్యుడిగా కొండూరు రవీందర్ రావు ను నాబార్డ్ చైర్మన్ మూడోసారి నామినేట్ చేశారు. ఈ పదవీకాలం 2028 వరకు కొనసాగనుంది.
ఇదే సంస్థ పాలక మండలిలో వరుసగా మూడోసారి సభ్యుడిగా ఎంపికైన తొలి వ్యక్తిగా రవీందర్ రావు నిలిచారు. ఇప్పటికే ఆయన సహకార బ్యాంకింగ్ రంగంలో విశేష సేవలందిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గతంలో కూడా ఆయనను ఇదే సంస్థలో సభ్యుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.