Ganesh Navratri | రుద్రంగి, ఆగస్టు 30 : గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ లో నెలకొల్పిన మట్టి గణనాథుడికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపాధాయులు, విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు మాట్లాడుతూ పర్యావరణంపై పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గత 5 సంవత్సరాలుగా మట్టి గణనాథులను నెలకొల్పి పూజలు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, డైరెక్టర్లు తిపిరెడ్డి వెంకట్రెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తదితరులు పాల్గొన్నారు.