Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 29 : మండలంలోని ఇందుర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1988- 89 విద్యాభ్యాసం పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. చాలా సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం తమ కుటుంబ విషయాలను ఒకరికొకరు తెలియజేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ తోటి విద్యార్థులలో ఐక్యతగా ఉండేందుకు వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసుకుని కష్టసుఖాలు భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నారు. తమకు విద్యను బోధించిన గురువులను ఆహ్వానించి వారికి శాలువా జ్ఞాపకలతో సత్కరించారు. అనంతరం సహపక్తి కోసం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.