Challur | వీణవంక ఏప్రిల్ 13: చల్లుర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు ఆదివారం నిర్వహించిన అపూర్వ సమ్మేళనం అందరిని అలరించింది. మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995-96 సంవత్సరంలో పదో తరగతి పూర్వవిద్యార్థులు అందరూ ఒక చోట చేరి వారికి చదువు చెప్పిన గురువులను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని, కష్ట సుఖాలను సభా ముఖంగా పంచుకున్నారు. అందరూ కలిసి ఆడి పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గురువులు మధన్మోహన్ రావు, రాజిరెడ్డి, రాంకుమార్, సుధాకర్, కాశీవిశ్వనాథ్, వెంకటేశ్వర్లు, శాంతకుమార్ సింగ్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.