కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 11 : ఐఐటీ అడ్వాన్స్డ్ -2022 ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వావిలాలపల్లి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు. అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అద్భుత ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. కళాశాలకు చెందిన ఈశ్వర్ రాథోడ్ 625వ ర్యాంక్, విశ్వనాథ్‌రెడ్డి 658, సాత్విక్ 758, సాయి కౌశిక్ 926, నిష్రాంత్రెడ్డి 961, అజ్మీరా గగన్ నాయక్ 1093, ఆరా 1124, రాం భువనేశ్వర్ 1184, దీక్షిత్ నాయక్ 1269, ముదావత్ శ్రీరామ 1285, నవదీప్ 1822, సిరి చందన 2209, విజయ్ సాత్విక్ 2302, కే ధీరజ్‌రెడ్డి 2777, డీ అపూర్వ 3020, ఎన్ హర్షిత్ 3390, విరినిచి 3624, సాయి శివ చరణ్ 3804, సీహెచ్ సుప్రీమ్ 3813, పీ చైతన్య 4222, ఎస్ ఆకాష్ 4250, డీ కార్తికేయ 4439, లాస్య 4827, అభిజ్ఞ 4852, శశిప్రీతమ్ 4967 ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే, 5 వేల లోపు 30 మంది, 10వేల లోపు 36 మంది ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంటిత దీక్ష, పట్టుదలతోనే ఇది సాధ్యమైందన్నారు.
మంచి ఐఐటీలో చదవాలన్నది నా కోరిక
దేశంలోని అత్యుత్తమ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగాను. ఈ క్రమంలో కళాశాల యాజమాన్యం సహకారంతో మంచి ర్యాంకు వచ్చింది. బోధనా సిబ్బందితో పాటు నరేందర్‌రెడ్డి సార్ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే నాకు ఇది సాధ్యమైంది.
– ఈశ్వర్ రాథోడ్, 625వ ర్యాంక్
సీఎస్సీ, ఈసీఈలో సీటు వస్తది
నాకు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో 758వ ర్యాంకు వచ్చింది. దీని ద్వారా దేశంలోని ఐఐటీలో సీఎస్సీ లేకుంటే ఈసీఈలో సీటు వస్తది. ఇది నాతోపాటు నా తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. రానున్నది కంప్యూటర్, ఎలక్ట్రానిక్ యుగం. దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే, మంచి సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
– సాత్విక్, 758వ ర్యాంక్