Dharmaram | ధర్మారం,నవంబర్ 2 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన మహాత్మ జ్యోతిబాపూలే (ఎంజేపీ) ప్రిన్సిపల్ జక్కని రాజేశం విద్యాశాఖ అదనపు ఆర్సీవోగా నియమితులయ్యారు. కాగా అతడిని ఆ గ్రామంలో ఆదివారం బీసీ ఆజాద్ ఫెడరేషన్ నాయకులు సన్మానించారు. రాజేశం ప్రస్తుతం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ మహాత్మ జ్యోతిబాపూలే (ఎంజేపీ) ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు.
దీంతో సదరు ప్రిన్సిపాల్ రాజేశం మెదక్ జిల్లా విద్యాశాఖ అదనపు రీజినల్ కోఆర్డినేటర్ ( ఆర్ సి ఓ) నియమితులయ్యారు. దీంతో ఆర్ సి ఓ రాజేశం ను ఆజాద్ ఫెడరేషన్ నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ తమ్మడవేణి శ్రీనివాస్, ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడు ముదాం శ్రావణ్ కుమార్, ధర్మారం మండల అధ్యక్షుడు అలువాల సంతోష్, గ్రామ శాఖ అధ్యక్షుడు పాలకుర్తి నరేష్, ముఖ్య సలహాదారు లు కాల్వ బాపన్న, ఎలిగేటి శ్రీనివాస్, నాయకులు వేల్పుల శంకర్, వేల్పుల శంకర్, బొంగాని సంపత్, ముత్యాల శ్రావణ్ కుమార్, కాల్వ అఖిల్, ముత్యాల మహేష్, కోరుట్ల రాకేష్, అలువాల సరిత గార్లు పాల్గొన్నారు.