ఆశ కార్యకర్తల కన్నెర్ర
కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర జేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కదం తొక్కారు. వందల సంఖ్యలో తరలివచ్చి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ఎన్నికల్లో గెలిచిన అనంతరం అమలును మరిచిపోయిందని మండిపడ్డారు.
- డిమాండ్ల సాధన కోసం కదం
- వందల సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
కరీంనగర్ కలెక్టరేట్, జూలై 22 : కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర జేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కదం తొక్కారు. వందల సంఖ్యలో తరలివచ్చి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ఎన్నికల్లో గెలిచిన అనంతరం అమలును మరిచిపోయిందని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం సత్వరమే తమ డిమాండ్లు పరిష్కరించాలని, అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్లపై స్పందించే దాకా ఆందోళన విరమించేది లేదని అక్కడే బైఠాయించారు. కరీంనగర్లో రెండు గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపించడంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా, వెనక్కి తగ్గకపోవడంతో డీఎంహెచ్‌వోను రప్పించారు. డిమాండ్లను వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా వైద్యాధికారి హామీ ఇవ్వడంతో ఆశ కార్యకర్తలు ఆందోళన విరమించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ, ఆశ కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి, నెలకు 18వేలు అందించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు వెంటనే రద్దు చేయాలని, బీసీజీ సర్వే, వ్యాక్సినేషన్ పనికి తగిన పారితోషికం అందించాలని కోరారు. ప్రతి ఆశ కార్యకర్తలకు 50లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనం కింద 5లక్షలు చెల్లించాలని, అనంతరం ప్రస్తుతమందిస్తున్న వేతనంలో సగం పెన్షన్‌గా మంజూరు చేయాలని విన్నవించారు. ఏటా 20 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, అలాగే, ఏఎన్ఎం, జీఎన్ఎంగా పదోన్నతి అవకాశం కల్పించాలన్నారు. ఆరోగ్య అధికారుల ద్వారా చేసే వైద్య పరీక్షలు ఆశ కార్యకర్తలకు అప్పగించవద్దన్నారు. జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని, లెప్రసీ సర్వే డబ్బులు సత్వరమే విడుదల చేయాలన్నారు. యూనిఫామ్‌లు అందజేయాలని, పనిభారం తగ్గించేందుకు జాబ్ చార్ట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీలత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు యూ శ్రీనివాస్, గుడికందుల సత్యం, జీ రాజవేశం, ఆశావర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద, నాయకురాళ్లు లక్ష్మి, లత, సుజాత, శ్యామల, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
హ్యాపీ బర్త్ డే వినోదన్న..
రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేసి, కేకులు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించగా, మరికొన్ని చోట్ల పండ్లు పంపిణీ చేయడంతో పాటు పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ‘హ్యాపీ బర్త్ డే టూ వినోదన్న’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
– కరీంనగర్ కార్పొరేషన్, జూలై 22
ఆర్ఎంవోగా డాక్టర్ శోభారాణి
విద్యానగర్, జూలై 22: గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా (ఆర్ఎంవో) డాక్టర్ శోభారాణిని నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం దవాఖానలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది కలిసి ఆమెకు అభినందనలు తెలిపారు. శోభారాణి అంతకుముందు హన్మకొండలో విధులు నిర్వర్తించారు. ఉద్యోగోన్నతిలో భాగంగా కరీంనగర్ జనరల్ హాస్పిటల్‌కి ఆర్ఎంవోగా వచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

