Vemulawada | వేములవాడ, జూన్ 25: ప్రసాదాల తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని వేములవాడ రాజన్న ఆలయ ఈవో రాధాబాయి అన్నారు. రాజన్న ఆలయంలోని గోదాం, స్వామి వారి ప్రసాదాల తయారీ విభాగాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. స్వామివారికి సరుకులు అందజేసే కాంట్రాక్టర్ వివరాలు తక్షణమే ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.
ఇక ప్రసాదాల విభాగంలో తయారవుతున్న ప్రసాదాలు వాటి తయారైన తేదీ, ఇప్పటిలోగా ప్రసాదాలు తినవచ్చు చివరి తేదీని కూడా ముద్రించే విధంగా చూడాలన్నారు. ప్రసాదాల తయారీలో నాణ్యత ఎక్కడ కూడా లోపించవద్దని సూచించారు. ప్రసాదాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక్కడ ఆమె వెంట పర్యవేక్షకుడు శ్రీనివాస్ శర్మ, భద్రతా విభాగం ఏఎస్ఐ మహేందర్ తదితరులు ఉన్నారు.