SULTANABAD | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 04: సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి లో గౌడ సంఘం గొల్లపల్లి సొసైటీ ఆధ్వర్యంలో కాటమయ్య స్వామి శుక్రవారం తాటి ముంజలతో అభిషేకం, నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ రావు పల్లి మాజీ సర్పంచ్ మొలుగూరి వెంకటలక్ష్మి అంజయ్య గౌడ్ మాట్లాడారు.
ఈ కాటమయ్య స్వామిని ముంజలతో కొలిచి దానితో మొదలై పండుదాళ్లు కోయడానికి ముందుగా కాటమయ్య స్వామిని కొలవడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత రేణుక ఎల్లమ్మ దీవెనలతో ఘనంగా కొలిచి గౌడ కులస్తుల తో పాటు గ్రామాలను అభివృద్ధిపరిచి ఆ చల్లని చూపు గ్రామ ప్రజలపై ఉండాలన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని కొలిచి గౌడలకు ఎలాంటి ఆపదలు రాకుండా గొల్లపల్లి , నారాయణరావుపల్లి సొసైటీలో పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరిని చల్లగా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం నారాయణ గౌడ్, సంఘం సభ్యులు మొలుగూరి సత్తయ్య, మొలుగూరి శ్రీనివాస్ , బాలసాని పరిసరాములు, మోలుగూరు సత్తయ్య, బొమ్మ తిరుపతి, మోలుగురి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మొలుగూరి ఎల్లయ్య, వడ్లకొండ రాములు, పొన్నం అంజయ్య, గుర్రం మల్లేశం గుర్రం రమేష్, వడ్లకొండ కొమురయ్య, ఇల్లందుల సంపత్, కోడూరి శేఖర్, పొన్నం సంతోష్ కుమార్, మొలుగూరి సాయి దీప్ తదితరులు పాల్గొన్నారు.