Suicide | జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన శ్రీలత (20) సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన అంకతి రాజు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన శ్రీలత అనే యువతిని తరచూ ప్రేమిస్తున్నానని తనను వివాహం చేసుకోవాలని వేధింపులకు గురి చేసేవాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన శ్రీలత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సత్తన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.