Kadari Satyanarayana Reddy | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 25: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అలియాస్ సాదు (69) గురువారం అంతక్రియలు జరిగాయి. ఉదయం మృతదేహం ఇంటికి చేరగా, కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటిపర్వంతమయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి మృతదేహం ఇంటికి చేరడంతో గ్రామస్తులు, ప్రజా సంఘాల నేతలు, అభిమానులు పలువురు సానుభూతిపరులు గోపాలరావు పల్లెకు చేరుకున్నారు. పలువురు నేతిలో ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజాసంఘాల నేతలు లాల్ సలాం అంటూ నినాదిస్తూ జోరు వానలో అంతక్రియలను జరిపించారు. కడారి సత్యనారాయణరెడ్డి క్లాస్ మెంట్ అయిన మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్ గోపాలరావు పల్లెకు చేరుకొని ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, పలువురు ప్రజా సంఘాల నేతలు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. 45 ఏళ్లుగా ఊరికి కుటుంబానికి దూరంగా ఉన్న సత్యనారాయణ రెడ్డి, ఎన్ కౌంటర్ లో మృతి చెంది, చివరి మజిలికి గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులంతా కన్నీటి వీడ్కోలు పలికారు.