Godavarikhani | కేరళ లో ఉజ్వల బృందానికి అరుదైన గౌరవం.. శ్రీ అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక నివేదన
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో గల ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం సన్నిధిలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వల బృందంకు అరుదైన ఆధ్యాత్మిక నివేదన అవకాశం లభించింది.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 25 : కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో గల ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం సన్నిధిలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వల బృందంకు అరుదైన ఆధ్యాత్మిక నివేదన అవకాశం లభించింది. ప్రతీ ఏటా పవిత్ర కార్తీక పౌర్ణమి పండుగ రోజున అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఉత్సవాలకు కేరళ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ, ధర్మదాయ శాఖ అందించిన ఆహ్వానం మేరకు నృత్యఖని ఆర్ట్స్ అకాడమి శిక్షకురాలు గుమ్మడి ఉజ్వల తన శిష్య బృందం హానిక, వైష్ణవి, వంశిక, శాన్విక, చరిష్య, శ్రీవల్లి, ఉపాగ్నలతో కలిసి పాల్గొని శాస్త్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించారు. పద్మనాభ స్వామి ముందు శాస్త్రీయ నృత్యంను సమర్పించడం కళాకారులకు పవిత్రమైన అంకితభావంగా పరిగణిస్తారు. మురజపం, లక్షదీపం తదితర ప్రత్యేక ఉత్సవాల సమయంలో మాత్రమే శాస్త్రీయ నృత్య కళారూపాలతో పాటు కూచిపూడి ప్రదర్శనలు అరుదుగా జరుగుతాయి.
నృత్యం, నాటకం, సంగీతం, అభినయం కలయికతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేలా ఉజ్వల బృందం నివేదించిన ప్రదర్శనలకు దేశ విదేశాల నుంచి హాజరైన భక్తులు, ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం గోదావరిఖని నుంచి రాష్ట్రాలు దాటి శాస్త్రీయ కళను ప్రదర్శించిన ఉజ్వల బృందంను రామగుండం కళాకారులు, కళాభిమానులు అభినందించారు. 2014లో గోదావరిఖని కేంద్రంగా నృత్యఖని అకాడమీ స్థాపించి కూచిపూడి నృత్యంకు పురుడు పోస్తుండటమే గాకుండా ఎంతోమంది చిన్నారులను నృత్య కళాకారులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఉజ్వల మాట్లాడుతూ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నృత్య ప్రదర్శన నివేదనకు అవకాశం లభించడం నృత్యఖని అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
Septic Tank | బాచుపల్లి ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
‘ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల సాధనకు పోరాటం’
‘చరిత్రలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష’
Dalimb Trailer | జీ5లో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

