ఎలిగేడు, మార్చి28: స్నేహితుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్న పూరెళ్ల సాయికుమార్ (17)ను హత్యకు గురయ్యాడు. పుట్టిన రోజే తనకు చివరి రోజు అయింది. ప్రేమ వ్యవహారం ఈ దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన గురువా రం రాత్రి ఎలిగేడు మండలం ముప్పిరితోట లో చేసుకుంది. సుల్తానాబాద్ సీఐ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి ముప్పిరితోటకు చెందిన పూరెళ్ల పరశురాములు-జ్యోత్స్న దంపతుల కుమారుడు సాయి కుమార్ (17) చదువు మానేసి ఖాళీ గా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం సాగిస్తు న్నాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తండ్రి సదయ్య సాయి కుమార్ను హతమార్చేందుకు పన్నాగం పన్నాడు. గురువారం రాత్రి సాయి గ్రామ శివారులో స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకుంటుండగా అక్కడి చేరుకున్న అమ్మాయి తండ్రి సదయ్య ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చనిపో యాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి పరశురాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి .పుట్టినరోజు నాడే హత్యకు గురికావడం గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సాయి కుమార్ సోదరి కొన్నేండ్ల కిందట డెంగీ మృతి చెందిం ది. పిల్లలిద్దరూ దూరం కావటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ముప్పిరితోటలో పురేళ్ల సాయికుమార్ గౌడ్ మృతదేహానికి బీజేపీ నాయకుడు పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.