Alphorse E-Techno School | కమాన్ చౌరస్తా, ఆగస్టు 29: కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా నైవేద్య మహోత్సవాన్ని శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల నిర్వాహకులు డాక్టర్ వీ వనజా నరేందర్ రెడ్డి హాజరై పూజలు న్విహించారు.
ఈ సందర్భంగా వనజా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడి పూజ వల్ల సకల శుభాలతో పాటు ఆయురారోగ్యాలు ఆష్టశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు సుమారు 120 రకాల నైవేద్యాలను స్వామివారికి మహా నైవేద్యంగా సమర్పించారు.
స్వామి వారికి ప్రీతికరమైనటువంటి మోదకాలు, ఉండ్రాళ్ళు, పాయసం, చక్కెర పొంగలి, పులిహోర, జిలేబి, బాదుషా, శనిగలు, గరిజెలు, మక్క గారెలు, పూరి, చపాతి, చకినాలు, అప్పాలు, వివిధ రకాల పండ్లు, పండ్ల రసాలు, చాక్లెట్లు తదితర ప్రసాదాలను స్వామి వారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.