ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
నగరంలోని రాంనగర్ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా లో మంగళవారం తెల్లవారుజామున ఓ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో షార్ట్ సర్యూట్ తో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది.
- కోటి రూపాయల ఆస్తి నష్టం
రాంనగర్, ఏప్రిల్ 25: నగరంలోని రాంనగర్ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా లో మంగళవారం తెల్లవారుజామున ఓ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో షార్ట్ సర్యూట్ తో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉ న్నాయి. నగరానికి చెందిన గుజ్జుల వేణు ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్నాడు. ప్లాస్టిక్ కవర్ల తయారీతో పాటు వాటిపై లేబుల్ ముద్రించే మిషన్ కూడా అకడే ఏర్పా టు చేశారు. దీనికోసం రోజు ఉదయం 6 గంటలకు వచ్చి మిషన్లు ఆన్ చేసి రెండు గంటల తర్వాత ప్లాస్టిక్ తయారీ ప్రారంభిస్తారు. రోజులాగే మంగళవారం ఉదయం 6 గంటలకు వచ్చిన వేణు మిషనరీలు ఆన్ చేసి బయట ఉ న్నాడు.
ఈ క్రమంలో కొద్దిసేపటికే షార్ట్ స ర్యూట్ అయి మంటలు రావడంతో యజమానితో పాటు స్థానికులు అప్రమత్తమై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మండలం అదుపు చేశారు. అప్పటికే ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే మిషనరీ పూర్తిగా అగ్నికి దగ్ధమైపోయింది. వీటి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని యజమాని తెలిపారు. వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించిన ఫైర్ అధికారులు షార్ట్ సర్యూట్తోనే అగ్ని ప్రమా దం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

