Odela Mallikarjuna Swamy Temple | ఓదెల, ఆగస్టు 21 : పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సామూహిక లక్ష బిల్వర్చన పూజా కార్యక్రమాలను వేద పండితులు వైభవంగా జరిపారు. శ్రావణమాసం అత్యంత ప్రవిక్యమైనది కావడంతో సకల మానవాళి మంచి కోసం శ్రీ స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా సామూహిక లక్ష బిల్వర్చన పూజలు నిర్వహించారు.
అలాగే అమ్మవారికి కుంకుమార్చన, బిల్వపత్రి, బిందతీర్థం, శివ పుణ్యహ వచనము, మహా హారతి, మంత్రపుష్పం, మారేడు చెట్టు వద్ద పత్రి పూజ తదితర కార్యక్రమాలు జరిగాయి. లక్ష బిల్వార్చన పూజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 180 మందికి పైగా దంపతులు ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఆలయ ఈవో సదయ్య, సిబ్బంది, అర్చకులు కల్పించారు. వేద పండితులు ధూపం వీరభద్రయ్య, భవాని ప్రసాద్, అభిషేక్ తదితరులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.