మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
మానకొండూర్ రూరల్, డిసెంబర్ 29: మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని దేవంపల్లిలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని సంఘం అధ్యక్షురాలు కసిరెడ్డి లత-ప్రభాకర్‌రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోనే భవనాన్ని రూ.7.15 లక్షలతో అన్ని సౌకర్యాలతో నిర్మించడం అభినందనీయమన్నారు. వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సొసైటీ ఆవరణలో గాని, పచ్చునూర్లోగాని స్థలాన్ని చూపిస్తే గోదాం నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అనంతరం లక్ష్మీపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. సర్పంచులు మాధవరం రమ, నర్మెట వసంత, వైస్ చైర్మన్ పాకాల రాజేందర్‌రెడ్డి, డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పంచాయతీ భవనం ప్రారంభం
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 29: రూ.22లక్షలతో నిర్మించిన రామకృష్ణకాలనీ గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుధవారం ప్రారంభించారు. అలాగే శ్మశానవాటిక, బృహత్ పల్లెప్రకృతి వనం, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంతో పోల్చితే గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మార్చి కల్లా గ్రామంలో డబుల్ బెడ్రూం నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ మీసాల అంజయ్య, పాలకవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, నాయకులు పాశం అశోక్‌రెడ్డి, గుజ్జుల ప్రణీత్‌రెడ్డి, దావు సంపత్‌రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.