వేములవాడ రూరల్/రుద్రంగి అక్టోబర్28: ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. గురువారం ఆయన వేములవాడ, రుద్రంగి వ్యవసాయ మార్కెట్లు, హన్మాజీపేటలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో వివిధ కారణాలతో మరణించిన 277 మందికి బీమా కింద 13.85 కోట్లు, రైతుబంధు ద్వారా 64094 మందికి 91.54 కోట్లను అందజేశామన్నారు. పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తే హర్షించాల్సిన కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు దిగడం శోచనీయమన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పప్పులు, నూనెలను మన రైతులు పండించాలని సూచించారు. ఇక్కడ ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు గడ్డం హన్మాండ్లు, పొన్నాల శ్రీనివాస్, ఆకుల భూమక్క, పీఏసీఎస్ చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్‌రావు, ఏలేటి చిన్నారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధ వి, జడ్పీటీసీ ఏశ వాణి, డీసీఎస్వో జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొస్కుల రవి, దేగావత్ తిరుపతి, మ్యాకల ఎల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, ఏఎంసీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్లు ఊరడి ప్రవీణ్, తూం కాంతరావు, సర్పంచ్ జంకె విజయ, ఉప సర్పంచ్ మధు, ఏఎంసీ డైరెక్టర్లు ఫీర్ మహ్మద్, అంజనీకుమార్, ఎంపీడీ వో శంకర్, ఏవో అనూష, డీటీ మల్లయ్య పాల్గొన్నారు.