మంత్రి కొప్పుల ఈశ్వర్
ఆలయంలో పూజలు
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
ధర్మపురి, ఆగస్టు 25: ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక కృషి చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం రాయపట్నం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ మహా శివాలయంలో బుధవారం విగ్రహ, నవగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాల్లో మంత్రి ఈశ్వర్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆలయానికి చేరుకున్న మంత్రికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనం గా ఆశీర్వదించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తున్నదన్నారు.
రీడింగ్ రూమ్ నిర్మాణానికి శంకుస్థాపన
రాయపట్నంలో గ్రామస్తుల సౌకర్యార్థం రూ.10లక్షల సీడీపీ నిధులతో నిర్మించనున్న రీడింగ్ రూమ్ నిర్మాణానికి మంత్రి ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. కొద్ది రోజుల్లోనే నిర్మాణం పూర్తవుతుందని, గ్రామస్తులు రీడింగ్ రూమ్‌ను సద్వి నియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రాయపట్నంలో ధర్మపురి మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లం దేవమ్మకు చెందిన పెట్రోల్ బంకును మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గారం, ధర్మపురి జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, రాయపట్నం సర్పంచ్ ఈర్ల చిన్నక్క-మొండయ్య, నాయకులు ఇనగంటి వినోద్‌రావు, వెంకటేశ్వర్రావుతోపాటు తదితరులున్నారు.