Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సాధించడంలో వెనుకబడుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ముగిసిన మొదటి ఆరు నెలల్లో కేవలం 25.66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని భావిస్తున్న సింగరేణికి ఈసారి కూడా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి ఆరు నెలల్లో కేవలం 25.66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగడంతో రానున్న ఆరు నెలల్లో 39.34 మిలియన్ టన్నుల భారీ బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఏర్పడింది. మొదటి ఆరు నెలల్లో నెలకు సరాసరిగా కేవలం నాలుగు మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి జరిగితే వచ్చే ఆరు నెలల్లో నెలకు సరాసరిగా 6.6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్ నెలలో 4126824 ట న్నుల లక్ష్యానికి గాను 4484890 టన్నులు (109%) సాధించి కొంత ఉరట కల్పించినప్పటికీ… రానున్న రోజుల్లో భారీ బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల్లో 2.22 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడి ఉండడం సింగరేణి ఆందోళన చెందడానికి కారణం అవుతుంది.
ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గడిచిన ఆరు నెలల్లో కొత్తగూడెంలో 526000 టన్నుల లక్ష్యాన్ని గాను 267655 టన్నులు( 51 శాతం ) ఎస్పీఎల్ లో 5816000 టన్నులకు గాను 7776992 టన్నులు (134%) ఇల్లందులో 1373000 తన్నులకు గాను 910136 టన్నులు (66%) మణుగూరులో 4468000 ట న్నులకు గాను 6175526 టన్నులు (138%) బెల్లంపల్లిలో 1400000 కు గాను 1553136 (111%) మందమర్రిలో 1171500 కు గాను 848496 (72%) శ్రీరాంపూర్ లో 2731500 కు గాను 1210046 (44%) రామగుండం-1 లో 1887400 గాను 1190797 (63%) రామగుండం-2లో 3926300 కు గాను 3985000 (101%) రామగుండం-3లో 1575000 కు గాను 1025719 (65%) అడ్రియాలలో 160300 కు గాను 40226 (31%) భూపాలపల్లిలో 1833200 కు గాను 672954 (37%) సాధ్యమైంది.
మొత్తం సింగరేణిలో 26868200 టన్నులకు గాను 25665083 (96%) సాధించింది. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో 27890914 టన్నులు సాధిస్తే ఈసారి 25665083 కి తగ్గి 2225831 టన్నులు వెనుకబడి ఉంది. వచ్చే ఆరు నెలల్లో ప్రతిరోజు రెండు లక్షల ఇరవై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తేనే నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్దేశిత లక్ష్యాలు సాధ్యం కాకుంటే లాభాలపై తీవ్ర ప్రభావం పడుతుందని దీని ద్వారా సింగరేణి ఇబ్బందులు ఎదుర్కొంటుందని భావిస్తున్నారు.