e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home కరీంనగర్ వైభవంగా సంకటహర చతుర్థి

వైభవంగా సంకటహర చతుర్థి

కమాన్‌చౌరస్తా, నవంబర్‌ 23: నగరంలోని పలు ఆలయాల్లో మంగళవారం సంకటహర చతుర్థి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రకాశ్‌ గంజ్‌లోని గణపతి ఆలయం, చైతన్యపురి మహాశక్తి ఆలయం, భగత్‌నగర్‌లోని అయ్యప్ప ఆలయం, అంజనాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశక్తి ఆలయంలో హోమం నిర్వహించగా, ఎంపీ బండి సంజయ్‌ హాజరయ్యారు. గంజ్‌ గణపతి ఆలయంలో పూలాభిషేకం కనుల పండువగా జరిపించారు. అలాగే, వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అర్చకుడు ఫణిశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీపాద వల్లభ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శ్వేతార్కగణపతికి రూర్వ అర్చనలు తంగళ్లపల్లి శ్రీనివాస్‌ శర్మ, సంపత్‌ శర్మ ఆధ్వర్యంలో చేశారు. కట్టరాంపూర్‌లోని గిద్దె పెరుమాండ్ల ఆలయంలో గణనాథుడికి, భగత్‌నగర్‌ అంజనాద్రి గుట్టపై గణనాథుడికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, ఆయా చోట్లు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల్లో గిద్దెపెరుమాండ్ల ఆలయ సేవకుడు కలర్‌ సత్తన్న, కన్యకా పరమేశ్వరీ ఆలయ చైర్మన్‌ చిట్టుమల్ల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్‌, బొల్లం శ్రీనివాస్‌, రాచమల్ల భద్రయ్య, చంద నారాయణ, చిలకపాటి హనుమంతరావు పాల్గొన్నారు.
కరీంనగర్‌ రూరల్‌, నవంబర్‌ 23: నగునూర్‌ దుర్గాభవానీ ఆలయంలో లక్ష్మీగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటి బాధ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
కరీంనగర్‌ రూరల్‌, నవంబర్‌ 23: గోపాల్‌పూర్‌ చింత చెరువు వద్ద స్వయంభూ గణపతికి అర్చకుడు ఈశ్వరయ్య, గ్రామస్తులు పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఊరడి మంజుల-మల్లారెడ్డి, ఉపసర్పంచ్‌ ఆరె శ్రీకాంత్‌, సాయిని తిరుపతి, రాంరెడ్డి, రాజిరెడ్డి, భాగ్యలక్ష్మి, అంజయ్య, శ్రీనివాస్‌, నారాయణ, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement