రూ.రెండు కోట్లు కేటాయింపుపై హర్షం
దొంగతుర్తిలో సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
ధర్మారం, ఆగస్టు 23: ధర్మారం మండలం దొంగతుర్తిలో రోడ్డు విస్తరణ, సైడ్ లైటింగ్ ఏర్పాటు కోసం నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్ర పటాలకు టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. గ్రామంలోని మర్రిపల్లి శివారు నుంచి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పెద్దపల్లి- ధర్మారం ఆర్అండ్బీ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేయడంతోపాటు సైడ్ లైటింగ్ సిస్టం కోసం రూ. 2 కోట్ల నిధులను డీఎంఎఫ్టీ ద్వారా మంత్రి కొప్పుల కేటాయించినట్లు ప్రకటించారు. నిధుల కేటాయింపును హర్షిస్తూ గ్రామంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సీఎం, మంత్రి చిత్ర పటాలకు నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మంత్రికి గ్రామస్తులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దాడి సదయ్య, ఉప సర్పంచ్ ముత్యాల చంద్ర శేఖర్, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ జుంజిపల్లి రమేశ్, చొప్పరి చంద్రయ్య, వార్డు సభ్యులు వేల్పుల కుమార్, వెన్నెం రమేశ్,విండో డైరెక్టర్ తమ్మడవేని రాజయ్య, బాలసాని తిరుపతి, ఐత వెంకట స్వామి,కాల్వ రమేశ్,లైశెట్టి లక్ష్మయ్య, ఆకుల తిరుపతి, ఈర్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.