వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు
గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 12 మందికి త్రిచక్రవాహనాలు అందజేత
వేములవాడ, ఆగస్టు 21: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా దివ్యాంగులకు చేయూతనందించడం అభినందనీయమని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి, కోనరావుపేట మండలాలకు చెందిన 12మంది దివ్యాంగులకు మంత్రి కేటీఆర్ త్రిచక్ర వాహనాలు సమకూర్చగా, శనివారం పట్టణంలోని సంగీత నిలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధురాజేందర్, కౌన్సిలర్లు మారం కుమార్, నరాల శేఖర్, సిరిగిరి రామచందర్, నిమ్మశెట్టి విజయ్, యాచమనేని శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, బాబున్, నాయకులు నామాల లక్ష్మీరాజం, కొండ కనకయ్య, సలీం, కుమ్మరి శ్రీనివాస్, పుల్కం రాజు, రామతీర్థపు రాజు, గుడూరి మధు, యేస తిరుపతి, వెంగళ శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.