e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home కరీంనగర్ మహిళల రక్షణకు సఖీ కేంద్రాలు

మహిళల రక్షణకు సఖీ కేంద్రాలు

హెల్ప్‌లైన్‌ 181పై విస్తృత ప్రచారం
కలెక్టర్‌ డాక్టర్‌ సర్వే సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి (నమస్తే తెలంగాణ) అక్టోబర్‌ 20: మహిళల రక్షణకు ప్రభుత్వం సఖీ కేంద్రాలు ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ డాక్టర్‌ సర్వే సంగీత సత్యనారాయణ తెలిపారు. మహిళల సంరక్షణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీతో బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి దాకా 10 సైబర్‌ నేరాలు, 5 వరకట్న వేధింపులు, 422 గృహహింస, 3 మెంటల్‌స్ట్రెస్‌, 26 మిస్సింగ్‌, 5 సెక్స్‌వల్‌ వేధింపులు, 5 పోస్కో, 6 బాల్య వివా హ, 45 ఇతర కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 445 కేసులు పరిష్కరించామని అధికారులు తెలిపారు. పెద్దపల్లి సఖీ కేంద్రం నిర్వహణ, వేధింపుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. మహిళల రక్షణ కోసం ప్రభు త్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 181పై అవగాహన కల్పించాలని, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని డీపీవోను ఆదేశించారు. సఖీ కేంద్ర నిర్వహణకు ఇద్దరు మహిళా హోంగార్డులు కేటాయించాలని అధికారులు విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఇవ్వాలని డీసీపీ రవీందర్‌ను ఆదేశించారు. సమావేశంలో డీసీవో రవూఫ్‌ ఖాన్‌, డీఆర్డీవో శ్రీధర్‌, డీపీవో చంద్రమౌళి, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, డీఈవో మాధవి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement