పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
ఆరోగ్య ఉపకేంద్రాలకు భూమి పూజ
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 20: వైద్యసేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పలు గ్రామాల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యం లో ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండలం కనగర్తి, మూలసాలలో శుక్రవారం జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా రెం డు ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.32 లక్షల నిధులతో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పేదలు ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులను కల్పిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బం డారి స్రవంతీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, సర్పంచులు పర్స స్వప్న, అశోక్, ఎనగందుల శంకరయ్య, ఎంపీటీసీలు ఎడెల్లి శంకరయ్య, మందల సరోజన, రాంరెడ్డి, రాఘవాపూర్, రాగినేడు పీహెచ్సీ వైద్యులు మమత, ఫణీంద్ర, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, మడుపు రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పద్మ, కొమురయ్య ఉన్నారు.
సదుపాయాల కల్పనకు కృషి
ఓదెల, ఆగస్టు 20: గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గుంపులలో రూ.30 లక్షల గ్రామపంచాయతీ నిధులతో గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అయినంక గ్రామాలకు మహర్దశ వచ్చినట్లు వివరించారు. స్వచ్ఛ శుక్రవారం పాటించి రోగాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు.
బోర్వెల్ పనుల ప్రారంభం
గుంపుల పోచమ్మ ఆలయ ఆవరణలో బోర్వెల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇక్కడ దాతలు మ్యాడగోని పద్మ-మొగిలి దంపతులు సొంత డబ్బులతో బోర్వెల్ వేయించగా, వారిని ఎమ్మెల్యే అభినందించారు. సమాజ హి తం కోసం దాతలు ముందుకు రావాలని పిలపునిచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్‌గౌడ్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కావటి రాజుయాదవ్, సర్పంచ్ తిప్పారపు చిరంజీవి, ఉప సర్పంచ్ గట్టు మహేశ్‌గౌడ్, ఎంపీటీసీ శారద, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఆకుల మహేందర్, ఉప్పుల సంపత్‌కుమార్ ఉన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద కరోనా నియంత్రణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఓదెలలో ప్రారంభించారు. టీఆర్ఎస్ నాయకులు బోడకుంట నరేశ్, పోలోజు రమేశ్‌తో పాటు గొర్ల తిరుపతి, ముత్తినేని సదానందం, గోపతి రమేశ్ రూ. 25వేలు వెచ్చించి ఐదు వందల ప్యాకెట్లను ఉచితంగా ప్రజలకు అందజేశారు. కరోనా నివారణ మందు తెప్పించి ఉచితంగా పంపిణీ చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు.