శనివారం 30 మే 2020
Karimnagar - Apr 09, 2020 , 02:56:38

నేతన్నకు యజమానుల భరోసా

నేతన్నకు యజమానుల భరోసా

  • 1000మంది కార్మికులకు 1500 చొప్పున 15లక్షలు అందజేస్తామని హామీ 
  • టెక్స్‌టైల్‌పార్క్‌ యూనిట్‌ యజమానుల అసోసియేషన్‌ ప్రకటన

సిరిసిల్ల రూరల్‌: సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ యజమానులు పెద్దమనసును చాటుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధిలేక ఇంటికే పరిమితమైన నేతన్నలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌లో సుమారు 1000 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. వారికి అండగా నిలవాలని కోరుతూ టెక్స్‌టైల్‌ పార్క్‌ యూనిట్‌ యాజమానుల అసోసియేషన్‌ సభ్యులతో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, చేనేత జౌళిశాఖ ఏడీ అశోక్‌రావు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికులను ఆదుకోవాలని సూచించారు. యజమానులకు ఏవైనా ఇబ్బందులుంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో టెక్స్‌టైల్‌ పార్క్‌ అసోసియేషన్‌ సానుకూలంగా స్పందించింది. కార్మికులకు అండగా ఉంటామని, పార్క్‌లోని 1000మంది కార్మికులకు ఒక్కొక్కరికి 1500ల చొప్పున 15లక్షలు అందిస్తామని ప్రకటించింది. ప్రతి మ్యాక్స్‌ సంఘం, ఎస్‌ఎస్‌ఐ యూనిట్‌ తరఫున నిధులను సమీకరించి కార్మికులందరికీ నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చింది. దీంతో అసోసియేషన్‌కు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభినందించారు. సమావేశంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌ అన్నల్‌దాస్‌ అనిల్‌, సిరిసిల్ల పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దూస భూమయ్య, ఆడెపు భాస్కర్‌, చిమ్మని ప్రకాశ్‌, ఎల్దండి శంకర్‌, వేముల శ్రీనివాస్‌, అంకారపు కిరణ్‌, లక్ష్మీనారయణ, బొద్దుల వేణు తదితరులు పాల్గొన్నారు.


logo