దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా
పెద్దపల్లి జంక్షన్ ఆవరణలో హమాలీ రెస్ట్ రూం ప్రారంభం
సూపర్ ఫాస్ట్ రైళ్లు నిలుపాలని ఎమ్మెల్యే దాసరి వినతి
పెద్దపల్లి జంక్షన్/ముకరంపుర ఆగస్టు 19: పెద్దపల్లి జిల్లాలోని పొత్కపల్లి వద్ద మానేరు నదిపై వంతన పూర్తి కాగానే కాజిపేట వరకు మూడో లైన్ పనులను త్వరలో పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీం గజానన్ మాల్యా తెలిపారు. పెద్దపల్లి రైల్వే జంక్షన్ ఆవరణలో బుధవారం హమాలీ రెస్ట్రూంను ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్లో జరుగుతున్న గూడ్స్ షెడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రైల్వేస్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రైల్వే జీఎంకు పుష్ప గుచ్ఛం, బుద్ధ్దుడి ప్రతిమను అందించారు. పెద్దపల్లి రైల్వే జంక్షన్లో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను నిలుపాలని విన్నవించారు. ఇందుకు జీఎం సానుకూలంగా స్పందించారు. అక్కడి నుంచి కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లెలోని రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ఆవరణ, గూడ్స్ యార్డును పరిశీలించారు. సరుకుల రవాణాపై ఆరా తీశారు. డీఆర్ఎం, స్టేషన్ మేనేజర్ బాలరాజు, రైల్వే హమాలీ సంఘం అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.