సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబర్ 15: జిల్లాలో ప్రగతిలో ఉన్న చెక్‌డ్యామ్‌లను త్వరగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జ యంతి నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని తన చాంబర్ లో నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశమై, మాట్లాడారు. జిల్లాకు మొ త్తం 24చెక్‌డ్యామ్‌లు మంజూరు కాగా, ఇప్పటివ రకు ఎనిమిది పూర్తయ్యాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 16 చెక్‌డ్యామ్‌లను నాణ్యతా ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా భూసేకరణ అవసరమైతే వెంటనే సేకరించి, పను లు ప్రారంభించాలన్నారు. వరద నీటిని మళ్లించడానికి చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గుడి చెరువు పనుల ప్రగతిపై ఆరా తీశా రు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మా నేరు వాగుపై కరకట్ట ఏర్పాటు పనుల్లో వేగం పెం చాలని సూచించారు. ఇక్కడ నీటి పారుదల శాఖ ఈఈ అమరేందర్‌రెడ్డి, డీఈలు జే సంతోష్, టీ ప్రశాంత్‌కుమార్, బీ నర్సింగ్, ఎం రవికుమార్ తదితరులు ఉన్నారు.
అదనపు తరగతి గదుల పురోగతిపై ఆరా
జిల్లాలోని పలు పాఠశాలల్లో నిర్మిస్తున్న అదన పు తరగతి గదులు, తదితర అంశాలపై టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ (విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) అధికారులతో కలిసి కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ప్రగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇతర పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సిరిసిల్లలో వృద్ధాశ్రమం, అంబేద్కర్ భవన నిర్మాణ పనులను త్వర గా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వస తి గృహాలన్నింటినీ తనిఖీ చేసి, వారంలోగా వసతిగృహాల్లో చేపట్టాల్సిన మరమ్మతులపై ఉమ్మడి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ ఈఈ వీ విరూపాక్ష, డీఈ సమ్మిరెడ్డి పాల్గొన్నారు.