మంత్రి కొప్పుల ఈశ్వర్
పాలకుర్తి మండలం మారేడుపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
పాలకుర్తి/ధర్మారం, ఆగస్టు 14: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకే ప్రభుత్వం దళితబంధు పథకానికి అంకురార్పణ చేసిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మారేడుపల్లిలో వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ. 5లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్ఆర్ఐ హరీశ్‌రెడ్డిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో రూ. 2లక్షల విరాళమివ్వడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ కళలను సాకారం చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మంత్రికి చిత్రపటాన్ని బహూకరించి, ఘనంగా సన్మానించారు.
పారిశుధ్యంతో వ్యాధులు దూరం..
నిత్య పారిశుధ్యంతో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు పూర్తిగా దూరమవుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. చెత్త సేకరణకు ధర్మారం పంచాయతీ నిధులు రూ. 10.60 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన హైడ్రాలిక్ వాహనాలను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం పెంపునకే ప్రభుత్వం పల్లెప్రగతిని ప్రారంభించిందన్నారు. ఇందుకోసం ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను అందించిందని చెప్పారు. ఊరూరా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీచైర్మన్ పుట్టమధూకర్, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి, సర్పంచులు పల్లె ఆశోక్, గంధం లక్ష్మీనారాయణ, లావణ్యాశ్రీనివాస్, నేతలు మాదాసు అరవింద్, కొమ్ము సంజీవ్, పందిళ్ల రాజిరెడ్డి, హరీశ్, మహిపాల్, జలంధర్, శ్రావణ్, నరేశ్, రంజిత్, సతీశ్, సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల లత, వార్డు సభ్యులు గోగు రవి కుమార్, అనవేని మహేందర్, ఎండీ షరీఫ్, నజియా ఫర్వీన్, దేవి లత, బొల్లి రాజేశ్వరి, తుమ్మల ఓదెలు, ద్యాగేటి లావణ్య, ఆవుల మల్లేశం, మేడవేని స్వప్న, రాగుల లావణ్య, దేవి రేణుక, ద్యాగేటి అనిల్ కుమార్, ఎంపీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, జీపీ కోఆప్షన్ సభ్యుడు కూరపాటి శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాస తిరుపతిరావు, ఏఎంసీ డైరెక్టర్ ఎండీ హఫీజ్, నేతలు ఎండీ అజాం బాబా, గాజుల రాజు, రాగుల మల్లేశం, దేవి అజయ్ పాల్గొన్నారు.