కొడిమ్యాల, ఆగస్టు (మల్యాల) 14 : కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న బేతాళస్వామి ఆలయంలో చందనోత్సవ కార్యక్రమాన్ని శనివారం శాస్రోక్తంగా ప్రారంభించారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు ప్రముఖ ఉపాసకుడు అనిల్‌కుమార్ జోషిని, స్వామి వారి పట్టువస్ర్తాలను విడిది నుంచి ఆలయం వరకు ఎదుర్కొని పూజా కార్యక్రమాలు ప్రారంభించా రు. మొదటి రోజు గణపతి పూజ , పుణ్యాహవాచనం, స్థాపితా దేవరాధన ప్రతిష్ఠ, యోగిని వస్ర్తు క్షేత్ర పాలక నవగ్రహ పూజ, సర్వతో భద్ర మండల పూజ, బేతాళ స్వామికి విశేష అభిషేకం పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం దేవతారాధన అగ్నిప్రతిష్ట్ర పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు. కాగా శ్రావ ణ శనివారం కావడంతో అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. దాదాపు 30వేల మంది అంజన్నను దర్శించుకునట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈవో వెంకటేశ్వర్లు, ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్, రామకృష్ణ, జితేంద్రప్రసాద్, ఉప ప్రధానార్చకులు చిరంజీవస్వా మి, జడ్పీటీసీ రాంమ్మోహన్రావు, సర్పంచ్ బ ద్దం తిరుపతిరెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.