నేషనల్ అచీవర్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూకు జిల్లా విద్యార్థిని ఎంపిక
గురుశాల, ప్రథమ్ సంస్థల సహకారంతో దేశ వ్యాప్తంగా ఐదు ఇన్నోవేటర్లకు స్థానం
తెలంగాణ నుంచి కీర్తి ఎంపిక
తెలంగాణ చౌక్, నవంబర్ 13: ప్రతిభకు సృజనాత్మకతను జోడించి ఆవిష్కరణలుగా మారిస్తే ఎన్నో పనులు సులభతరం అవుతాయి. విద్యార్థుల్లో పుట్టుకొచ్చే కొత్త ఆలోచనలు కార్యరూపం దాలచ్చేందుకు ప్రోత్సహిస్తే వారు విజ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకత, వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రోత్సహించేందకు గురుశాల, ప్రథమ్ సంస్థల సహకారంతో వోడాఫోన్ ఐడియా ఆధ్వర్యంలో నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా మీట్ ఇన్స్పైరింగ్ స్టూడెంట్స్ విభాగంలో భాగంగా నేషనల్ అచీవర్స్ ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం నుంచి దేశంలోని అన్ని రాష్ర్టాల విద్యా శాఖల నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన నూతన ఆవిష్కర్తల వివరాలను సేకరించి వాటిలోంచి ఐదు ఆవిష్కర్తలను ఎంపిక చేశారు. వీరిని ఆదివారం సాయంత్రం 3 నుంచి 4:30 గంటల వరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ హెచ్ సీ వర్మ ఐఐటీ కాన్పూ ర్ ఆన్లైన్లో జూమ్ విత్ యూ ట్యూబ్ ద్వారా ఇంట్రాక్ట్ కానున్నారు.
తెలంగాణ నుంచి కీర్తి ఎంపిక
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్ హైస్కూల్లో ఐదో తరగతి చదువుత న్న విద్యార్థిని యు కీర్తి రూపొందించిన మల్టీపుల్ అగ్రికల్చర్ బ్యాగు నూతన ఆవిష్కరణ ఎంపిక కావడంతో శభాష్ అని అనిపించుకున్నది. ఈ సందర్భంగా విద్యార్థినికి జిల్లా విద్యాధికారి డీ రాధాకిషన్ ప్రత్యేక శుభాంక్షాలు తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న జూమ్ విత్ యూ ట్యూబ్ ద్వారా ప్రసారమ య్యే ఇంటర్వ్యూను వీక్షించాల్సిందిగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాల ఉపాధ్యాలు, విద్యార్థులను ఆయన కోరారు.
మల్టీపుల్ అగ్రికల్చరల్ బ్యాగు ఉపయోగం
వ్యవసాయ పనుల్లో రైతులకు ఒకేసారి వారికి రకరకాల వస్తువులు, పరికరాలు అవసరం పడుతుంది. ఆయా వస్తువులను ఇంటి దగ్గరి నుంచి పొలం వద్దకు తీసువెళ్లడం.. పొలంలో పని చేసే సమయంలో అవసరం ఉన్నవాటి కోసం ప్రతిసారి గట్టుకు రావాల్సి ఉం టుంది. ఇలా పొలంగట్టుకు రావడంతో కాళ్లనొప్పులు, సమయం వృథా అవుతుంది. ఇలాంటి వాటి ని అధిగమించి అన్ని వ్యవసాయ సామగ్రిని ఒకేసారి ఆ బ్యాగులో అమర్చుకోవడానికి మల్టీపుల్ అగ్రికల్చరల్ బ్యాగ్ ఉపయోగపడుతుంది.
మంత్రి కేటీఆర్ అభినందనలు
వయసుతో సంబంధం లేకుండా విభినమైన ఆవిష్కరణలకు ఇంటింటా ఇన్నోవేటర్ వేదికగా నిలుస్తుం ది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుంచి ఇంటిం టా ఇన్నోవేటర్ అంకురార్పణ చేసింది. ఇందులో ఎంపిక చేసిన ప్రాజెక్టులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలను అందిస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తున్నది. ఇందులో ఉత్తమ ప్రతిభ చూపిన ఆవిష్కరణలను రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని కీర్తిని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
అమ్మానాన్నలకు సాయంగా..
మాది వ్యవసాయ కుటుంబం. నేను కీడ్స్ కాన్వెంట్లో ఐదో తరగతి చదువుతున్నాను. మా తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లినప్పుడు నీరు తాగేందుకు ఒక్కసారి, విత్తనాలు, ఎరువులకు ఇలా చాలాసార్లు బయటకు(గట్టు) రావాల్సి వచ్చేది. ఇది గమనించిన నేను మా టీచర్ వెన్నల మేడం సాయంతో ఇబ్బందులను అధిగమించేందుకు మల్టీపుల్ బ్యాగును తయారు చేశాను. ఇందులో నీరు, విత్తనా లు, ఎరువులు, టిఫిన్ బాక్స్, సెల్ఫోన్, కొడవలి పెట్చుకోవచ్చు. బ్యాగును భుజాలకు తగిలించుకుం టే భుజాలు, నడుముకు సమానమైన బరువు ఉంటుంది.