మంథని రూరల్, సెప్టెంబర్ 12: నాగారంలో టీఆర్ఎస్ కమిటీని ఎన్నుకున్నారు. నాగారం అధ్యక్షుడిగా బెల్లంకొండ దయాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బూడిద గట్టయ్య, కమిటీ, అనుబంధ కమిటీలను పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యైటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబర్ 12: రామగిరి మండలం వెంకట్రావుపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా బూడిద సమ్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం రాత్రి గ్రామంలో కార్యకర్తల సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు శంకేసి రవీందర్, ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా ఆర్బీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జనగామ నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా జూనగిరి సుధాకర్, కోశాధికారిగా బూడిద ఓదెలు, కార్యవర్గ సభ్యులుగా సమ్మయ్యనాయక్, బొంత రమేశ్, ఎండీ మొహీనొద్దీన్, కుకట్ల రాజు, మంథని రాజయ్య, రామిండ్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రామిండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా మంథని రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా బూడిద చిన్న సమ్మయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా వాంకుడోత్ సమ్మయ్యనాయక్, ఉపాధ్యక్షుడిగా భ్లీమా నాయక్, ప్రధాన కార్యదర్శిగా వాంకుడోత్ సారయ్యనాయక్, యూత్ అధ్యక్షుడిగా తోటపల్లి వినోద్, ఉపాధ్యక్షుడిగా మంథని వంశీ, ప్రధాన కార్యదర్శిగా బొంత రమేశ్‌ను ఎన్నుకున్నారు.
అనంతరం నూతన కమిటీ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ బాధ్యులు మాదరనేని కుమార్, పోగుల వీరారెడ్డి, ధర్మరాజు సంపత్, ఆరెల్లి కొమురయ్యగౌడ్, భాస్కర్, ఇబ్రహీం పాల్గొన్నారు.
రామగిరి, సెప్టెంబర్ 12: జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు రామగిరి మండలం లద్నాపూర్ టీఆర్ఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు మండలాధ్యక్షుడు శెంకేసి రవీందర్ తెలిపారు. అధ్యక్షుడిగా తుమ్మల అశోక్, ఉపాధ్యక్షుడిగా నారమల్ల రాయమల్లు, కార్యదర్శిగా రామిండ్ల సునీల్, యూత్ అధ్యక్షుడిగా పెద్దపల్లి సంతోష్, ఉపాధ్యక్షులుగా కాసిపేట రామకృష్ణ, డేగ రాజు, కార్యదర్శిగా నల్ల అనిల్, బీసీ కమిటీ అధ్యక్షుడిగా రాజవీరు, ఉపాధ్యక్షులుగా చిప్ప రవి, తొట్ల రాయమల్లు, కార్యదర్శిగా సంజీవ్‌ను ఎన్నుకున్నట్లు వివరించారు.
జ్యోతినగర్, సెప్టెంబర్ 12: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి ఎన్టీపీసీ పట్టణ పరిధి రెండో డివిజన్లో టీఆర్ఎస్ కమిటీని నియమించారు. ఇందిరమ్మకాలనీలో నియామక ప్రక్రియకు పార్టీ డివిజన్ ఇన్చార్జి, కార్పొరేటర్ ఎన్వీ రమణారెడ్డి, పార్టీ మండల పరిశీలకులు పాతిపల్లి ఎల్లయ్య, మున్సిపల్ మాజీ అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్ కమిటీని ప్రకటించారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడిగా సుద్దాల గోపాల్, మహిళా అధ్యక్షురాలిగా కవితారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఎర్రోళ్ల కుమారస్వామి, దిలావత్ రమేశ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ పాషా, కార్మిక విభాగం అధ్యక్షునిగా అర్చనపల్లి అభిలాశ్‌ను ఎన్నుకున్నారు.
ముత్తారం, సెప్టెంబర్12: దర్యాపూర్, మైదంబండ టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. దర్యాపూర్ అధ్యక్షుడిగా కుంకటి మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా దొడ్ల కిషన్, యూత్ అధ్యక్షుడిగా దొడ్ల రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా దొమ్మటి నరేశ్ ఎన్నికయ్యారు. మైదంబండ అధ్యక్షుడిగా జంగవెంకట్రెడ్డి ఎన్నికైనట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్‌యాదవ్, సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిషన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్రావు, సర్పంచులు నూనె కుమార్, గాదం స్రవంతి శ్రీనివాస్, ఎర్రం శారద సదానందం, ఎంపీటీసీ బియ్యాన్ని శారద సదానందం పాల్గొన్నారు.