హరితహారం దేశానికే ఆదర్శం
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధి
జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేటలో పర్యటన
అభివృద్ధి పనులకు భూమిపూజ
జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 12: సబ్బండ వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్నపేట పరిధిలోని గోపాల్రావుపేటలో 20లక్షలతో జడ్పీస్కూల్ ప్రహరీ, ఎస్సారెస్పీ కాలువపై 20లక్షలతో స్లాబ్ నిర్మాణానికి జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆదివారం భూమిపూజ చేశా రు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉన్నదన్నా రు. గతంలో అక్షర జ్వాల కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్‌కు వచ్చానని గుర్తు చేసుకున్నారు. శిథిల భవనాలను కూల్చడం తప్పులేదన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని హితవు చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని, ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. సమైక్య పాలనలో రైతులు నీళ్ల కోసం కొట్లాడే పరిస్థితి ఉండేదని, ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి నీళ్ల కష్టాలను దూరం చేశారని చెప్పారు. హరితహారంలో విరివిగా మొక్క లు నాటి చైనా, బ్రెజిల్ సరసన తెలంగాణ నిలిచిందన్నారు. మెడికల్ కాలేజీ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని, ప్రజలకు ఆమోదయోగ్యమైన స్థలంలో నిర్మిస్తామని చెప్పారు.
5కోట్లతో చల్గల్ పండ్ల మార్కెట్ నిర్మా ణం తుది దశలో ఉందన్నారు. గోపాల్రావుపేట ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జడ్పీ చైర్పర్సన్ వసంత కొందరు గిట్టనివారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. విజిలెన్స్ అధికారులకు లేఖ లు రాస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతి గ్రామాన్ని పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విరివిగా నిధులు ఇస్తున్నారని చెప్పారు. అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జగిత్యాలలోని 47, 48 వార్డుల్లో వార్డు కమిటీ, అనుబంధ కమిటీల ఎన్నికలను ఆదివారం టీఆర్‌నగర్‌లోని వీరముష్టి సంఘం లో నిర్వహించారు. 47వ వార్డు అధ్యక్షుడిగా ఎంఏ ఖాసీం, 48వ వార్డు అధ్యక్షుడిగా నటాచలం విఘ్నేశ్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాలకు ఎమ్మెల్యే నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రౌతు జయ, అర్బన్ ఇన్చార్జి ఎంపీపీ ములాసపు లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, ప్యాక్స్ చైర్మన్ సందీప్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ జిఆర్ దేశాయి, మాజీ సర్పంచ గంగాధర్, అర్బన్ మండల రైతుబంధు కన్వీనర్ జుంబర్తి శంకర్, ఉప సర్పంచ్ బొడ్డు బుచ్చ న్న, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం మహేశ్ ఉన్నారు.