గ్రామపంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు
ఓదెల, ఆగస్టు 12: గ్రామపంచాయతీలు అందించే పౌర సేవలపై గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామస్తులతో సభలు నిర్వహించి అవగాహన కల్పించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నూతనంగా రూపొందించిన పౌర సేవలను గ్రామసభల్లో వివరించారు. ఇందులో ఆస్తి పన్ను, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, సామాజిక ఆస్తులు, ధ్రువీకరణ, అనుమతి పత్రాలు, గ్రామపంచాయతీ పరిపాలన, అభివృద్ధి సంబంధిత అంశాలు, సంక్షేమ సంబంధిత, కొవిడ్, ఆరోగ్య సంబంధిత, డిజిటల్ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సేవలను వినియోగించుకునేందుకు దరఖాస్తుదారులు ప్రభుత్వం, గ్రామపంచాయతీకి ఏ బకాయిలు ఉండరాదని పేర్కొన్నారు. పొత్కపల్లి, కొలనూర్, నాంసానిపల్లి, ఓదెల, గుండ్లపల్లి, మడక, గోపరపల్లి, ఉప్పరపల్లిలో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచులు ఆళ్ల రాజిరెడ్డి, సామ మణెమ్మ, పులుగు తిరుపతిరెడ్డి, కర్క మల్లారెడ్డి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్, ఆగస్టు 12: నీరుకుళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమావేశంలో సర్పంచ్ కోటగిరి విజేందర్, ఎంపీటీసీ శీలం శంకర్, ఉప సర్పంచ్ మాధవరావు, పంచాయతీ కార్యదర్శి సురేందర్‌రావు తదితరులున్నారు.
రామగిరి, ఆగస్టు 12: కల్వచర్ల గ్రామ పంచాయతీ ఆవరణలో సిటిజన్ చార్టర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గంట పద్మ వెంకటరమణారెడ్డి, వార్డు సభ్యులు బిరుదు భాగ్యలక్ష్మి, ఎరుగురాల కమల, కార్యదర్శి సురేశ్, అంగన్వాడీ టీచర్లు స్వరూప, అనసూర్య, ఆశవర్కర్ స్వప్న, శారద, విజయ, ఐకేపీ సిబ్బంది కనకలక్ష్మి, పద్మ, దేవిక, కారోబార్ కనకయ్య తదితరులు ఉన్నారు.