మంత్రి హరీశ్‌రావుకు జైకొట్టిన హుజూరాబాద్ గడ్డ
అడుగడుగునా ఘన స్వాగతం
హుజూరాబాద్, జమ్మికుంటలో భారీ ర్యాలీ
గులాబీమయమైన నియోజకవర్గం
హుజూరాబాద్/జమ్మికుంట/ ఇల్లందకుంట/ ఇల్లందకుంట రూరల్, ఆగస్టు 11: మంత్రి హరీశ్‌రావుకు హుజూరాబాద్ గడ్డ బ్రహ్మరథం పట్టింది. బుధవారం ఆయన హుజూరాబాద్‌కు రాగా నియోజకవర్గం నలుమూలల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. ముందుగా మంత్రి హరీశ్‌రావుకు హుజూరాబాద్ కేసీ క్యాంపు వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపం వద్ద హరీశ్‌రావు నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మంత్రి గంగుల ఆధ్వర్యంలో 2 వేల బైకులతో కేసీ క్యాంపు నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. మార్గమధ్యంలో శాలపల్లి-ఇందిరానగర్ వద్ద సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను వాహనంపై నుంచే పరిశీలించారు. కాగా, జమ్మికుంట నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ర్యాలీగా ఇల్లందకుంటకు బయలుదేరారు. మోత్కులగూడెం వద్ద అంబేద్కర్, తెలంగాణ చౌక్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా ఇల్లందకుంటలోని ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లారు.
ఇల్లందకుంటలో జనజాతర
ఇల్లందకుంట కిక్కిరిసింది. మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిర్వహించిన ‘హుజూరాబాద్ ప్రజాశీర్వాద సభ’కు 20 వేల మంది దాకా తరలివచ్చారు. ముందుగా మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, గంగులకు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ వనమాల, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. సన్మానించారు. కాగా, గాయకుడు సాయిచంద్ తన కళాబృందంతో ఆడి పాడిన పాటలు సభికులను ఉర్రూతలూగించాయి. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని డప్పుచప్పుళ్లతో ప్రజలను ఉత్సాహ పరిచారు. గొల్ల, కుర్మల రాష్ట్ర నాయకులు గోస్కుల శ్రీనివాస్‌యాదవ్, చేవేళ్ల సంపత్కుర్మ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావును కలిసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఇల్లందకుంట రాములోరిని మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, గంగుల, తదితరులు దర్శించుకున్నారు.
పదివేల మందితో మహిళా సదస్సు..
వీణవంక ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు మహిళాలోకం తరలివచ్చింది. మహిళా సంఘాలకు రుణాలు, వడ్డీ మాఫీ, భవనాల నిర్మాణం వంటి అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మండలం నుంచి 10 వేల మంది తరలివచ్చారు. రుణమాఫీ, వడ్డీలేని రుణాల పత్రాలు, భవనాల నిర్మాణానికి ఇచ్చిన చెక్కులు అందుకొని చిరునవ్వులు చిందించారు.
గులాబీ మయమైన నియోజకవర్గం
మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట గులాబీమయమైంది. చెల్పూర్ పరిధిలోని రాజపల్లిలో మంత్రికి యాదవులు గొంగడి కప్పి గొర్రె పిల్లను చేతిలో పెట్టారు. జమ్మికుంటలో కౌన్సిలర్ నరేశ్‌గౌడ్, నాయకుడు మొలుగు దిలీప్.. మంత్రికి కత్తిని బహూకరించారు. ఆయా చోట్ల మంత్రులతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, నన్నపునేని నరేందర్, మేయర్ వై సునీల్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు చొల్లేటి కిషన్‌రెడ్డి, వడ్లూరి విజయ్‌కుమార్, గందె శ్రీనివాస్, దొంత రమేశ్ పాల్గొన్నారు.