హుజురాబాద్ టౌన్, జూలై 10: హుజురాబాద్ (Huzurabad) పట్టణంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణం సమీపంలోని సాయి కన్వెన్షన్ అండ్ లాడ్జిలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 11 మంది పేకాట రాయుళ్లతోపాటు రూ.18,750 నగదు, 11 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్నవారితో పాటు సాయి కన్వెన్షన్ ఓనర్పై కూడా కేసు నమోదు చేసినట్టు హుజురాబాద్ టౌన్ ఎస్ఐ రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.