కలెక్టర్ ఆర్వీ కర్ణన్
సీపీ సత్యనారాయణతో కలిసి సభాస్థలి పరిశీలన
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 10: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న చేపట్టబోయే దళిత బంధు ప్రారంభోత్సవ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో సభాస్థలి ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్నారని తెలిపారు. సభ డయాస్ నిర్మాణం, వీఐపీ, ప్రెస్, లబ్ధిదారుల, ప్రజల గ్యాలరీలు వేర్వేరుగా బ్లాకులుగా నిర్మించాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు సూచించిన ప్రకారం డయాస్ నిర్మించాలన్నారు. వీఐపీ వాహనాల పారింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే వాహనాలకు కేటాయించిన స్థలంలోనే పారింగ్ చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ లాల్, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి నతానియేల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన శర్మ , జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, మేనేజర్ నవీన్‌కుమార్, హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలి
కార్పొరేషన్, ఆగస్టు 10: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకానికి అర్హులైన లబ్ధిదారుల వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఇండ్ల వెళ్లి అర్హుల పూర్తి వివరాలు, బ్యాంక్ ఖాతా నంబర్, ఎంచుకున్న వ్యాపార వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు గానూ మండలాలు, గ్రామాల వారీగా సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, తదితరులు పాల్గొన్నారు.