POCSO Case | ఫోక్సో కేసులో ఒకరికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా
పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దున్నపోతుల కుమార్ అనే వ్యక్తికి ఫోక్సో కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి ఫోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు వెలవరించింది.
POCSO Case | ఓదెల, జులై 17 : పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దున్నపోతుల కుమార్ అనే వ్యక్తికి ఫోక్సో కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి ఫోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు వెలవరించింది. బాధితురాలు తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో నిందితుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది. విరాల ప్రకారం.. మైనర్ బాలిక చదువుతున్న క్రమంలో తరచూ ప్రేమ పేరున వేధింపులకు గురి చేశాడు. బాలిక తన ఇంటి కుటుంబ కలహాల కారణంగా తన అక్క ఇంటికి కరీంనగర్ కు ఒంటరిగా వెళుతుండగా ఆమెను వెంబడించి బలవంతంగా తన బైకుపై ఎక్కించుకున్నాడు.
మార్గమధ్యంలో వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి బాధితురాలు స్వగ్రామం రాగా, కిరాణం షాప్ కు వెళ్లే క్రమంలో మరోమారు లైంగిక దాడి చేశాడు. బాధితురాలకి కడుపునొప్పి రావడంతో ఆమె తల్లి పెద్దపల్లి దావఖానకు తీసుకువెళ్లింది. అక్కడ వైద్య పరీక్షలు చేయగా గర్భవతిగా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో తనను వివాహం చేసుకోవాలని నిందితుడిని బాలిక కోరగా అందుకు నిరాకరించాడు. దీంతో ఆమె పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేశారు.
కాగా పెద్దపెల్లి ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ జరగగా, న్యాయమూర్తి స్వప్న రాణి ఇరువర్గాల వాదనలు, సమర్పించిన సాక్షాధారాలను పరిశీలించి నిందితుడు కుమార్ పై నేరాభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించారు. నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా పనిచేసిన పోలీసులను రామగుండం సీపీ, పెద్దపల్లి డీసీపీ అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Fine
- Jail
- Odela
- Peddapally
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

