మంత్రి కొప్పుల ఈశ్వర్
మండల కమిటీ అధ్యక్షులకు అభినందన
ధర్మారం, అక్టోబర్ 9: టీఆర్ఎస్ పదవులు పొందిన వారంతా పార్టీ కోసం అంకిత భావంతో పని చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పార్టీ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూ రి శ్రీధర్, అనుబంధ విభాగాల మండలాధ్యక్షులు మంద శ్రీనివాస్, ఆవుల లత, నందాల మల్లేశం, భారత స్వామి, అజ్మీరా మల్లేశం నాయ క్, ఎండీ హఫీజ్, దేవి నళినీకాంత్, దేవి వంశీకృష్ణ, రేగుల జితేందర్, మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్ తదితర నాయకులు హుజూరాబాద్‌లో మంత్రిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పార్టీలో పదవులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసి, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సం దర్భంగా మంత్రి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల ప్రకారం పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని, కృషి చేసిన వారికే పదవులు దక్కుతాయనే విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి గ్రామాల్లో పార్టీని మ రింత బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియ జేయాలని వివరించారు. ఇక్కడ నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, ఎంపీటీసీలు సూరమల్ల శ్రీనివాస్, మిట్ట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధులుగా..
ముత్తారం,అక్టోబర్ 9: టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధులుగా దర్యాపూర్‌కు చెందిన తిత్తుల శ్రీనివాస్, ముత్తారానికి చెందిన బేద సంపత్‌ను జడ్పీ చైర్మన్ మధూకర్ నియమించారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. తమను నియమించిన జడ్పీ చైర్మన్, ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలతఅశోక్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సూదాటి రవీందర్‌రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.