రాష్ట్ర పైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
అయిలాపూర్‌లో పర్యటన
పాపన్న విగ్రహావిష్కరణ, గౌడ సంఘం భవనం ప్రారంభోత్సవం
కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 9: ప్రభుత్వం కులవృత్తులకు ప్రాధాన్యమిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, రాష్ట్ర పైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్, పేర్కొన్నారు. అయిలాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ, గౌడ సంఘ భవనం ప్రారంభోత్సవానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్గౌడ్తో కలిసి పాల్గొని మాట్లాడారు. సర్కారు గౌడ కులస్తుల ఆర్థికాభివృద్ధికి తాటి, ఈత చెట్టు పన్నులను రద్దు చేసిందన్నారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన గీత కార్మికులకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అర్హులందరికీ ద్విచక్రవాహనాలు అందించనుందని తెలిపారు. గీత కార్మికుల కోసం అందిస్తున్న తాటి, ఈత మొక్కలను డ్రిఫ్ ద్వారా సంరక్షించుకోవాలని సూచించారు. అంతకుముందు గ్రామస్తులు ఎమ్మెల్యే, పైనాన్స్ కమిషన్ చైర్మన్, గ్రంథాలయ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. గౌడ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులను శాలువా, పూలమాలతో సత్కరించారు. మున్సిపల్ అనుబంధ గ్రామం ఎఖీన్‌పూర్, అంబేద్కర్‌నగర్ కాలనీలో వైకుంఠధామాల నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిడు గు రాధ, ఎంపీపీ తోట నారాయణ, గౌడ సంఘం తాలుకా అధ్యక్షుడు పూదరి నర్సాగౌడ్, టీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, అన్నం అనిల్, పీఏసీఎస్ చైర్మన్ చింతకుంట సాయిరెడ్డి, గౌడ సంఘం మండలాధ్యక్షుడు బొల్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు బండి రవీందర్‌గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.