ధర్మారం, సెప్టెంబర్9: ధర్మారంలో ఎన్నికల ఇన్చార్జీలు ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెం చాల రాజేశం, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫి కమిటీలను ఏర్పాటు చేశారు. నంది మేడారంలో ఎన్నికల ఇన్చార్జీలు ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, సూరమల్ల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సామంతుల జానకి, ఎంపీటీసీ మిట్ట తిరుపతి, జడ్పీ కోప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బుచ్చయ్యపల్లిలో ఎన్నికల ఇన్చార్జీలు ఆర్బీఎస్ మండల సభ్యుడు పాక వెంకటేశం, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దొనికెని తిరుపతి గౌడ్, ఐత వెంకట స్వామి ఆధ్వర్యంలో కమిటీలను నియమించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడిశెట్టి కొమురయ్య, ఏఎంసీ డైరెక్టర్ బొంగాని తిరుపతి పాల్గొన్నారు. అలాగే కానంపల్లి, గురుపల్లిలో ఎన్నికల ఇన్చార్జీలు, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు.
యైటింక్లయిన్ కాలనీ, సెప్టెంబర్ 9: రామగిరి మండలం సుందిల్ల కమిటీని మండలాధ్యక్షుడు రవీందర్, దాసరి రాజలింగు హాజరై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొగిరి భాస్కర్, ఉపాధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ల మనోజ్, సంయుక్త కార్యదర్శిగా వేముల శ్రావణ్, కోశాధికారిగా కనుకుల నాగస్వామి, కార్యవర్గ సభ్యులుగా సుంకరి బాలకృష్ణ, రమణారెడ్డి, మల్లేశ్, నర్సింగ్, బాపు, యూత్ అధ్యక్షుడిగా కనుకుల సంజీవ్, ఉపాధ్యక్షుడిగా దివాకర్, ప్రధాన కార్యదర్శి రీగన్, బీసీ సెల్ అధ్యక్షుడిగా గర్రెపల్లి పరుశరాం, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పేగ లక్ష్మీనారాయణ ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి లక్ష్మి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ మాధవరావు, కాపురబోయిన భాస్కర్, ఆరెల్లి కొమురయ్య, ఉప సర్పంచ్ గర్రెపల్లి సదానందం పాల్గొన్నారు.
ముత్తారం,సెప్టెంబర్9: అడవిశ్రీరాంపూర్ అధ్యక్షుడిగా నిమ్మతి రమేశ్, ఉపాధ్యక్షుడిగా మేరుగు రమేశ్, ప్రధాన కార్యదర్శిగా పోలు దాసరి సంతోష్, కార్యదర్శిగా పాంచాల చక్రపాణి, కోశాధికారిగా లక్కాకుల సదయ్య, హరిపురం అధ్యక్షుడిగా అడ్డూరి భాస్కర్, ఉపాధ్యక్షులుగా తాడూరి రమేశ్, కూస సతీశ్, ప్రధాన కార్యదర్శిగా గుర్రాల నరేశ్, సంయుక్త కార్యదర్శిగా రామంచ పోశాలు, యూత్ అధ్యక్షుడిగా కూస వెంకటేశ్, ఉపాధ్యక్షులుగా పగుర్ల రాజు, మునిగంటి రాకేశ్, కార్యదర్శిగా మధుకర్, సంయుక్త కార్యదర్శిగా తాడూరి వినయ్‌ను నియమించారు. కేశనపల్లి అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కందునూరి రాజు, కల్వచర్ల మొగిలి, ప్రధాన కార్యదర్శిగా చిందం సదానందం, సంయుక్త కార్యదర్శిగా వైద్య వైకుంఠంను ఎన్నుకోగా, యూత్ అధ్యక్షుడిగా మంథని సంతోష్, ఉపాధ్యక్షులుగా శివశంకర్, చుంచు శివ, ప్రధాన కార్యదర్శిగా దొడ్ల రమేశ్, కార్యదర్శిగా తోట రవీందర్, సంయుక్త కార్యదర్శిగా బండి రాకేశ్, గౌరవ అధ్యక్షుడిగా కృష్ణను నియమించారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలతఅశోక్ యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ అత్తె చంద్రమౌళి, వైస్ ఎంపీపీ సుదాటి రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్, సర్పంచులు తుంగాని సమ్మయ్య యాదవ్, సంపత్‌రావు, నాయకులు తాత బాలు, మధుకర్, మద్దెల దివాకర్ పాల్గొన్నారు.
రామగిరి, సెప్టెంబర్ 9: ఆదివారం పేట అధ్యక్షుడిగా ఎలువాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఆరెల్లి ప్రశాంత్, కార్యదర్శిగా మల్లయ్య, సంయుక్త కార్యదర్శిగా అంకూస్, కోశాధికారిగా శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడిగా గొడిశెల రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా జక్కుల శివకుమార్, కార్యదర్శి మల్లేశ్, సంయుక్త కార్యదర్శిగా వినయ్, కోశాధికారిగా సంజీవ్, ప్రచార కార్యదర్శిగా ఎలువాక కోటిని ఎన్నుకున్నారు.
రామగిరి మండలం నాగేపల్లి కమిటీని ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్ తెలిపారు. అధ్యక్షుడిగా గద్దల శంకర్, ఉపాధ్యక్షుడిగా పొన్నం శ్రీను, ప్రధాన కార్యదర్శిగా రామిండ్ల గోపాలకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా తీగల రాజయ్య, కోశాధికారిగా చింతం మహేందర్ ఎన్నికయ్యారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ కొండవేన ఓదెలు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ధర్ముల రాజసంపత్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కుమార్ యాదవ్, నాయకులు ఆరెల్లి కొమురయ్య గౌడ్, కాపురబోయిన భాస్కర్, ప్రభాకర్ పాల్గొన్నారు.