మేయర్ వై సునీల్‌రావు
మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ
కార్పొరేషన్, సెప్టెంబర్ 9: మట్టి గణపతులను ప్రతిష్ఠించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మేయర్ వై సునీల్‌రావు కోరారు. స్థానిక 33వ డివిజన్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆయన మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 10 వేల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి రూ. 65 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. 37వ డివిజన్లోని శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాల ఆవరణలో టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. జ్యోతినగర్‌లోని సంతోషిమాత ఆలయం వద్ద ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. సంస్థ ప్రతినిధులు కర్రె పావని, అంజలి, రేణుక, మౌనిక, రమ, సరోజ, దేవిక, ప్రభాకర్, రాము, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బాల రక్ష భవన్లో అదనపు కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ గరిమా అగర్వాల్ మట్టి గణపతులను పంపిణీ చేశారు. జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్మి, సంక్షేమాధికారి రవీందర్, సీడబ్ల్యూసీ సభ్యులు కళింగ శేఖర్, చైల్డ్ లైన్ 1098 జిల్లా కో-ఆర్డినేటర్ సంపత్, ఐసీడీఎస్, మెప్మా అధికారులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, సెప్టెంబరు 9: విద్యానగర్‌లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రాంతీయ సహ కార్యదర్శి కోమాళ్ల రాజేందర్‌రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు ఇనుగంటి మధుసూదనరావు, ఊటూరి రాధాకృష్ణారెడ్డి, నగర కార్యదర్శి తోట రాజేందర్, పెండ్యాల కేశవరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మాతృమండలి సభ్యురాలు పద్మ, స్థానికులు పాల్గొన్నారు. షిరిడీ సాయి భక్త భజన మండలి ఆధ్వర్యంలో మట్టి, విత్తనాలతో తయారు చేసిన 500 గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. సంఘం గౌరవాధ్యక్షుడు నలుమాచు చంద్రశేఖర్, అధ్యక్షుడు మధుసూదన్, సభ్యులు చిట్టుమల్ల కొండయ్య, నర్సింగరావు, విశ్వనాథుల శ్రీనివాస్, అర్చకుడు శర్మ, దయాసాగర్, నలుమాచు రాణి, జ్యోతి, సావిత్రి, భారతి పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా/కొత్తపల్లి, సెప్టెంబర్ 9 : గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పంపిన విత్తన గణపతులను టీఆర్ఎస్ నాయకుడు కొలిపాక మల్లికార్జున్ స్థానిక అధికారులకు, నాయకులకు అందజేశారు. ఇందులో భాగంగా విత్తన గణపతులను అడిషనల్ డీసీసీ చంద్రమోహన్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఏసీపీ తుల శ్రీనివాసరావు, సబ్ రిజిస్ట్రార్లు కిరణ్ తేజ వర్మ, శ్రీనివాస చారికి అందజేశారు.
హౌసింగ్‌బోర్డుకాలనీ, సెస్టెంబర్ 9: స్థానిక సుమంగళి గార్డెన్స్, మారుతీనగర్‌లో హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. హమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ధనపూరి సాగర్, సభ్యులు తోట అనిల్, మనోజ్, కుమార్ ముందడా, ప్రవీణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, భాస్కరచారి, క్రాంతి, వినాయక భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, సెప్టెంబర్ 9: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో సహాయ సంచాలకుడు డాక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. అధ్యాపకులు, సిబ్బంది రామకృష్ణ, కొమురయ్య సత్యనారాయణ, పరశురాం, మహదేవ్, వీరస్వామి మల్లయ్య పాల్గొన్నారు.
చొప్పదండి, సెప్టెంబర్ 9: పట్టణంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో 100 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. లయన్స్‌క్లబ్ జోనల్ చైర్మన్ కొల్లూరి జితేందర్, సభ్యులు నలుమాచు సుధాకర్, మామిడి రాజేశ్ పవార్, పెద్ది లక్ష్మీకాంతం, పచ్చునూరి తిరుపతి, మహేశుని మల్లేశం, వెల్మ రాజిరెడ్డి, దూస రాము, కోటగిరి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.