కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
పలు గ్రామాల్లో ధాన్యం సెంటర్లు ప్రారంభం
చొప్పదండి, నవంబర్ 8: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అ మ్మి మోసపోవద్దు.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొ నుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి’ అంటూ చొ ప్పదండి ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ సూచించారు. మండలకేంద్రంలోని వ్యవసాయమార్కెట్ ఆవరణలో, గుమ్లాపూర్‌లో ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని, చిట్యాలపల్లి, మంగళపల్లి, దేశాయ్‌పేట గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని అన్నారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని, ఇది రైతుల శ్రేయస్సును కోరే ప్రభుత్వం అని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుకరవి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మమల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, వైస్ చైర్మన్ కొత్తగంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మాజీ ఎంపీపీ వల్లాల క్రిష్ణహరి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, సర్పంచులు నాగిరెడ్డి, రవి, సురేశ్, సౌజన్య, ఎంపీటీసీలు వెల్మ విజయలక్ష్మి , బత్తుల లక్ష్మీనారాయ ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, కౌన్సిల ర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, డైరెక్టర్లు కొల్లూరి ఆనందం, పెద్దిలక్ష్మీకాంతం, బీసవేని రా జశేఖర్, పబ్బ శ్రీనివాస్, యశోద రాజయ్య, కు మార్, పద్మ, నాయకులు నలుమాచు రామక్రిష్ణ, మచ్చ రమేశ్, బత్తిని సంపత్, గాండ్ల లక్ష్మణ్, గుడిపాటి వెంకటరమణారెడ్డి, మావూరం మహేశ్, కొత్తూరి నశ్, వడ్లకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆఖరి గింజా కొంటాం..
గంగాధర, నవంబర్ 8 : రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతులు ఇ బ్బంది పడకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మద్దతు ధర అడిగితే వాహనాలతో తొక్కించిన చరిత్ర బీజేపీదన్నారు. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ సా గి మహిపాల్‌రావు, వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, జోగు ల క్ష్మీరా జం, నాయకులు అలువాల తిరుపతి, రేండ్ల శ్రీనివాస్, రామిడి సుంరేదర్, వేముల అంజి, వ డ్లూ రి ఆదిమల్లు, గర్వంధుల పర్శరాములు, సామంతుల శ్రీనివాస్, మామిడిపెల్లి అఖిల్ ఉన్నారు.