మంత్రి కొప్పుల ఈశ్వర్
వరదలో కొట్టుకుపోయిన బాధిత కుటుంబాలకు పరామర్శ
8లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత
గొల్లపల్లి, సెప్టెంబర్ 8: అధైర్యపడొద్దు.. అన్నివిధాలా అం డగా ఉంటామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట దేవునికుంట మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన తం డ్రీకొడుకులు గంగన్న (గంగమల్లు),విష్ణువర్ధన్ కుటుంబాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరామర్శించారు. వరదలో కొట్టుకుపోయి మృతి చెందడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రీకొడుకుల మృతి ఆ కుటుంబానికి తీర ని లోటన్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, తాను స్థానికంగా లేకపోవడంతో మంగళవారం రాలేదని, కలెక్టర్, అధికారులను ఆదేశించి సంఘటనా స్థలానికి పంపించినట్లు పేర్కొన్నారు. గంగన్నకు 4లక్షలు, విష్ణువర్ధన్‌కు 4లక్షల చొప్పున మొత్తం 8లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను బాధిత కుటుంబానికి అందించా రు. విష్ణువర్ధన్ వయసులో చిన్న వాడైనప్పటికీ ఎక్స్‌గ్రేషియా ఇచ్చే అవకాశం లేకున్నా వెసులుబాటు కల్పించి ఇప్పించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన మత్తడిని పరిశీలించారు. మత్తడి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు.
మండల కేంద్రానికి చెందిన తాండ్ర జీవన్, ఎదులాపురం శారద, గుంజపడుగు లో సర్పంచ్ కొత్తూరి సరిత మామ చంద్రయ్య, దావుల రాజ య్య, సంగ దేవక్క మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దావుల రాజయ్య కరోనాతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో మృతి చెందగా వైద్య ఖర్చుల కోసం రూ.2లక్షలు చెల్లించినప్పటికీ మరో రూ.2లక్షలు ఇస్తేనే బిల్లులు, మరణ ధ్రువీకరణ ఇస్తామని దవాఖాన సిబ్బంది తెలిపినట్లు ఆ కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి దవాఖాన సిబ్బందితో మాట్లాడారు. బొంకూర్‌కు చెందిన అంగన్వాడీ టీచర్ సరిత మృతి చెందగా ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. చందోలికి చెందిన బొల్ల జీవన్ (జగదేవిపేట జీపీ కార్యదర్శి) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద ఉండగా మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్, సరిత, సత్తయ్య, శంకర్, ఎంపీటీసీ అశోక్, విండో ఉపాధ్యక్షుడు నవ్వ తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి బాబు, యూత్ అధ్యక్షుడు రవీందర్, నాయకులు నారాయణ రెడ్డి, లింగారెడ్డి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.