తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
సైదాపూర్, ఆగస్టు 8: పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలానికి చెందిన పది మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.3 లక్షల 52 వేల 500 విలువైన ఆర్థిక సాయం మంజూరైంది. హుజూరాబాద్ మండలం సింగపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ లబ్ధిదారులకు చెకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్‌రావు, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, ప్యాక్స్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వొడితల ప్రణవ్‌బాబు, సింగిల్ విండో చైర్మన్ బిళ్ల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు చెలమల్ల రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, సర్పంచులు కొండ గణేశ్, పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్, బత్తుల కొమురయ్య, మ్యాకల శిరీషాముకుందరెడ్డి, ఎంపీటీసీ అనిత, మాజీ జడ్పీటీసీ బెదరకోట రవీందర్, దిశ సభ్యురాలు ఓరుగంటి దేవేంద్ర, టీఆర్ఎస్ నాయకులు ముత్యాల వీరారెడ్డి, మునిగంటి స్వామి, శంకర్‌రెడ్డి, మహిపాల్‌సింగ్, రాంరెడ్డి, అంజిరెడ్డి, సుధాకర్, రాజేందర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.