చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య
ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీ ప్రారంభం
రుద్రంగి(చందుర్తి), జనవరి 8: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య పిలుపునిచ్చారు. చందుర్తి హైస్కూల్ ఆవరణలో అనంతపల్లి మాజీ సర్పంచ్ జువ్వాడి రాంగోపాల్‌రావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఉమ్మడి కరీనంగర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీని శనివారం ఆమె స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడారు. యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుతో పాటు ఆటలపై దృష్టిపెట్టాలన్నారు. క్రీడలతో శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్రావు మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో క్రీడాకారుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విజయం సాధించిన జట్లకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్‌కుమార్ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్‌రావు, వైస్ ఎంపీపీ అబ్రహం, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, సర్పంచ్‌లు సిరికొండ ప్రేమలత, దుమ్ము అంజయ్య, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రం, నిర్వాహకులు వెంకటేశ్వరరావు, నాయకులు బైరగోని రమేశ్, గంగం మహేశ్, చిలుక పెంటయ్య, సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, పీఈటీలు పాల్గొన్నారు.